నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రాయన్. సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, మటన్ కొట్టు రాయన్‌గా ధనుష్ లుక్‌తో పాటు సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం పోస్టర్‌లు వైరల్ అయ్యియి. అయితే సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు ఉండడంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ షూరు చేసింది రాయన్ టీమ్. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.
రాయన్ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మే 09 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో అపర్ణ బాల మురళి, విష్ణువిశాల్, దుషారా విజయన్, సెల్వ రాఘవన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ను జూన్ 07న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.