ఆయన ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన ఆ నాయకుడు 86 ఏళ్ల వయసులో పదో తరగతి పాసయ్యాడు. హర్యానా మాజీ మఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా ఎట్టకేలకు 10వ తరగతి పాసయ్యారు. వెనుకటికి 10వ తరగతి ఇంగ్లిష్‌లో ఫెయిల్ అయిన చౌతాలా ఆ తర్వాత చదువు మానేశారు. అయితే ఇటీవల లేటు వయసులో మళ్లీ చదవాలనిపించింది. అయితే, 10వ తరగతిలో ఒక సబ్జెక్టు పెండిరగ్ ఉన్న కారణంగా చౌతాలా ఇంటర్ ఫలితాన్ని విత్ హెల్డ్‌లో పెట్టారు. దాంతో ఆయన ఇటీవల 10వ తరగతి ఇంగ్లిష్ పరీక్ష రాశారు. ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణులైనట్లు హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లిష్ సబ్జెక్టులో మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగగా చౌతాలాకు 88 మార్కులు వచ్చాయి.
ఓపెన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌లో జాయిన్ అయ్యారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే ఈ ఏడాది ఓపెన్ ఇంటర్ స్టూడెంట్స్‌ను పాస్ చేశారు. అయితే పది పూర్తి చేయకుండానే ఇంటర్‌కు ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఓం ప్రకాశ్ చౌతలా పదో తరగతి పాసవడంతో ఇంటర్ కూడా ఉత్తీర్ణత సాధించాడు.