ఇదో సాదాసీదా రికార్డు కాదు. నేపాల్ పర్వతారోహకుడు, 59 సంవత్సరాల షెర్పా కమీరీటా 29వ సారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. తన పాత రికార్డును తానే బద్ధలు కొట్టాడు. 54 ఏండ్ల వెటరన్ పర్వతారోహకుడు కామి రిటా ఇక్కడి సెవెన్ సమ్మిట్ ట్రెక్స్‌లో సీనియర్ గైడ్‌గా పనిచేస్తున్నారు. అతను ఆదివారం ఉదయం 7.25 గంటలకు ఎవరెస్ట్‌పై 8,849 మీటర్లకు చేరుకున్నాడని ఇక్కడి టూరిజం శాఖ తెలిపింది. కామి రిటా 1994 లో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్‌ను అధిరోహించారు. ప్రపంచంలో ఎవరెస్ట్‌ను అత్యధికమార్లు అధిరోహించిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో నిలిచారు.