అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే అవకాశాన్ని భారత్‌కు ఇచ్చామని భారత్‌లోని అమెరికన్ రాయబారి ఎరిక్ గార్సెటి చెప్పారు. రష్యా చమురును భారత్ కొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీత స్థాయిలో పెరగలేదన్నారు. భారత దేశం దీనిపై సరైన రీతిలో స్పందించిందని చెప్పారు. ఆయన ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన అంతర్జాతీయ వ్యవహారాల్లో వైవిధ్యం సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు పరిణామం చెందుతున్న తీరుపై ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో రష్యా-చైనా ప్రభావం విషయంలో స్వల్ప విజయాలు సాధించామని చెప్పారు.