ప్రజాదరణలో ప్రపంచ నేతలందరి కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారు. కొద్దిరోజుల్లో పుట్టిన రోజు జరుపుకోనున్న ప్రధాని మోదీ ఈ రేటింగ్స్ రూపంలో అరుదైన బహుమతి లభించినట్లయింది. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ద మార్నింగ్ కన్సల్టే ఈ సర్వే చేపట్టింది. అగ్రరాజ్య అధినేతల కంటే మోదీ చాలా ముందంజలో నిలిచారు. మోదీకీ ఏకంగా 70 శాతం ఆదరణ లభించింది. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యూల్ లోపెజ్ అబ్రేడర్ 64 శాతం మద్దతులో రెండవ స్థానంలో నిలిచారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి తర్వాతి స్థానం దక్కించుకున్నారు. ఆయనకు 63 శాతం మద్దతు లభించింది. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెట్ (52 శాతం), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (48 శాతం), కెనడా ప్రధాని ట్రూడో (45 శాతం), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (41 శాతం), దక్షిణ కొరియా బాన్‌కీ మూన్ (35 శాతం), బ్రెజిల్ ప్రధాని బొల్సానారో (39 శాతం), జపాన్ ప్రధాని సుగా (25 శాతం) ఈ జాబితాలో ఉన్నారు.