రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో ఉన్న నదిలో వాళ్లు మునిగిపోయారు. ఆ విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు పంపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొన్నది. నోవోగరోడ్ సిటీలో ఉన్న స్టేట్ యూనివర్సిటీలో ఆ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఓ అమ్మాయి నది నీటిలో కొట్టుకుపోతున్న సమయంలో, ఆమెను రక్షించేందుకు మిగితా ముగ్గురు నదిలోకి దిగారు. అయితే వాళ్లు కూడా ఆ నది నీటిలో మునిగిపోయారు.
వాళ్లతో ఉన్న మరో ఓ విద్యార్థి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. బంధువులకు మృతదేహాలను పంపించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రాణాలతో బయటపడ్డ ఓ విద్యార్థికి చికిత్స అందిస్తున్నట్లు మాస్కోలోని భారతీయ ఎంబసీ పేర్కొన్నది. బాధిత బంధువులకు సమాచారాన్ని చేరవేసినట్లు అధికారులు తెలిపారు. వీరు మహారాష్ట్రలోని జలగావ్‌కు చెందినవారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.