Namaste NRI

కేశినేని నాని సంచ‌ల‌న నిర్ణ‌యం… రాజ‌కీయాల నుంచి

 వైఎస్సార్‌సీపీ నాయ‌కుడు కేశినేని నాని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు నాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేశినేని నాని పోటీ చేశారు. కానీ సొంత త‌మ్ముడు కేశినేని చిన్ని చేతిలో నాని ఓట‌మి చ‌విచూశారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాననని నాని వెల్లడించారు.

నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాను. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపూర్వమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి. వారి తిరుగులేని మద్దతుకు నా కృతజ్ఞతలు. నేను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా,  విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంటుంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటా ను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయ వాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు అంటూ కేశినేని నాని ప్రకటించారు.

Social Share Spread Message

Latest News