ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (ఎఎఎ) ఫీనిక్స్ లో సమావేశం నిర్వహించింది. ఫీనిక్స్, ఆరిజోనా లో 2024 జూన్ 19న ఎఎఎ ఫీనిక్స్లోని డీ బాంక్వెట్ హాల్లో ప్రారంభ సమావేశం నిర్వహించింది. ఈ సభలో దాదాపు 100కు పైగా హాజరై ఆంధ్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించారు. కళ్యాణ్ గోట్టిపాటి బృందం ఆధ్వర్యం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగ పర్యవేక్షకునిగా వ్యవహరించారు. ఫీనిక్స్ ఎఎఎ ప్రారంభ సమావేశం వాసు కొండూరు ఆకర్షణీయమైన ప్రసంగంతో మొదలైంది.

ఎఎఎ నాయకత్వ బృందం హరి మోతుపల్లి ( సంస్థ వ్యవస్థాపకులు), బాలాజీ వీర్నాల (గవర్నింగ్ బోర్డు), కళ్యాణ్ కార్రీ (గవర్నింగ్ బోర్డు), రవి చిక్కాల (గవర్నింగ్ బోర్డు), గిరీష్ అయ్యప్ప (న్యూ జెర్సీ చాప్టర్ అధ్యక్షుడు), సత్య వేజ్జు (ప్రెసిడెంట్-ఎలెక్ట్, న్యూ జెర్సీ), వీరభద్ర శర్మ (పెన్సిల్వేనియా చాప్టర్ అధ్యక్షుడు), ప్రదీప్ సెట్టిబలిజ (డెలావేర్ చాప్టర్ అధ్యక్షుడు), హరి తూబాటి (డెలావేర్ ప్రెసిడెంట్-ఇలెక్ట్) ఎఎఎ లక్ష్యాలను వివరించారు. తెలుగు సంస్కృతి , సంప్రదాయాలను సంరక్షించడం, వాటి ప్రాముఖ్యతపై చర్చలు జరిగాయి. భోగి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి వంటి పండుగలలో ఉన్న ఏకత్వం, కలిసి ఉండే భావనపై వక్తలు ప్రసంగించారు. ఎఎఎ ఈ గొప్ప సంస్కృతి వారసత్వ ఉత్సవాలని మరిన్ని నిర్వహించి భవిష్యత్తు తరాలకు అందించడం కోసం వేదికగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం లో కళ్యాణ్ గోట్టిపాటి, నాగ (న్యూ జెర్సీ), వసు కొండూరు, జయరాం కోడె, మధు అన్నె, నరేంద్ర పర్వతరెడ్డి, నాగేంద్ర వుప్పర, రమేష్ కుమార్ సురపురెడ్డి, రాజమోహన్ సందెళ్ళ, పుల్లారావు గ్రాంధి, సాయిబాబు, భాను పాల్గొన్నారు.
