అమెరికా లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ , బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందారు. ఆర్కెన్నాస్లోని సూపర్ మార్కెట్ లో గోపి పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు అకస్మాత్తుగా లోపలకు వచ్చి తుపాకీతో అతనిపై కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. మృతుడు స్వస్థలం బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలం, యాజలిగా గుర్తించారు.