అల్లు శిరీష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకుడు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా, అధవ జ్ఞానవేల్ నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్‌సింగ్ కథానాయికలు. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ టెడ్డీబేర్ నేపథ్యంలో నడిచే యాక్షన్ మూవీ ఇది. కథ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో టెడ్డీబేర్ రియల్ హీరో. ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యాను కాబట్టే ఈ సినిమా చేశా. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది అన్నారు.
రాజమౌళికి తాను అభిమానినని, ఆయన తీసిన ఈగ స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించానని దర్శకుడు శామ్ ఆంటోన్ తెలిపారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పటివరకూ రానటు వంటి సరికొత్త కాన్సెస్ట్ ఇదని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పారు. జూలై 26న విడుదలకానుంది. ఈ చిత్రాని కి కెమెరా: కృష్ణన్ వసంత్, సంగీతం: హిప్‌హాప్ తమిళ, ఆర్ట్: ఆర్.సెంథిల్, నిర్మాత: కేఈ జ్ఞానవేల్‌రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా, రచన-దర్శకత్వం: శామ్ ఆంటోన్.