Namaste NRI

చరిత్ర సృష్టించిన చైనా

చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు గత నెలలో చైనా ప్రయోగించిన చాంగే-6 లూనార్‌ ప్రోబ్‌ అక్కడి మట్టి నమూనాలను తీసుకుని విజయవంతంగా భూమికి తిరిగొచ్చింది. ఉత్తర చైనాలోని ఇన్నర్‌ మంగోలియా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలకు చాంగే-6 రిటర్న్‌ క్యాప్సూల్‌ ల్యాండ్‌ అయినట్టు చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ (సీఎన్‌ఎస్‌ఏ) వెల్లడించింది. దీంతో చంద్రుని ఆవలి భాగం మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చిన తొలి దేశంగా చైనా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు దక్షిణ ధృవాన్ని ఏ దేశం అన్వేషించలేదు. చాంగే-6 లూనార్‌ ప్రోబ్‌ గత నెల 3న భూమి నుంచి బయల్దేరి జూన్‌ 2న చంద్రుని దక్షిణ ధృవంలోని అయిట్కిన్‌ (ఎస్‌పీఏ) బేసిన్‌లో దిగింది.

 మే 3 వ తేదీన చాంగే 6 నింగికెగిరి , దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. జూన్ 2 న జాబిల్లి ఆవలివైపున సౌత్ పోల్ అయిట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్‌లో అది సురక్షితంగా చంద్రుడి ఉపరితలాన్ని తాకింది. ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్, అనే నాలుగు భాగాలున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress