బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం సికందర్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నా డు. నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా ఈ మూవీని నిర్మిస్తున్నా రు. ముంబయిలో ముహూర్తపు షాట్‌తో సికందర్ షూటింగ్ షురూ అయింది. ఇక తొలి షెడ్యూల్ లో భాగంగా మెహబూబ్ స్టూడియోస్‌లో ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనుండగా, సల్మాన్ ఖాన్ అండ్ టీం ఈ షూట్‌లో పాల్గొననున్నారు.
ఈ చిత్రాన్ని 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సికిందర్‌లో సత్యరాజ్ విలన్‌గా నటించనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. సముద్ర మట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో ఎయిర్‌క్రాఫ్ట్‌లో సల్మాన్ ఖాన్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.