Skip to main content

Namaste NRI

వీధుల్లో జంతువుల్లా కూర్చోబెట్టి.. జార్జియాలో భారతీయులపై అమానవీయ ప్రవర్తన

ఈ వీసాలు, సరైన పత్రాలతో జార్జియాకు వెళ్లిన తమ పట్ల అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఓ భారతీయ మహిళ  ధ్రువీ పటేల్  ఆరోపించారు. జంతువుల్లా వీధుల్లో కూర్చోబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. అర్మేనియా లోని సడఖ్లో సరిహద్దు నుంచి జార్జియా లోకి వెళ్తున్న 56 మంది భారతీయులను అక్కడి అధికారులు ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆరోపించారు.

తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నప్పటికీ, 5 గంటలకు పైగా గడ్డకట్టే చలిలో ఉంచారన్నారు. ఆ సమయంలో ఆహారం ఇవ్వకపోగా, కనీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా అనుమతించలేదని పేర్కొన్నారు. 2 గంటల పాటు తమ పాస్‌పోర్టులను తీసుకుని జంతువుల్లా ఫుట్‌పాత్‌పై కూర్చోబెట్టారన్నారు. నేరస్థుల్లా తమను వీడియోలు కూడా తీసినట్టు తెలిపారు. కానీ అధికారులు ప్రవర్తించిన తీరుపై వీడియో తీస్తున్న తమను అడ్డుకున్నట్టు వివరించారు. పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే వీసాలు తప్పుగా ఉన్నాయని చెప్పారని వెల్లడించారు. భారతీయుల పట్ల జార్జియా అధికారుల తీరు సిగ్గుచేటని, ఆమోద యోగ్యం కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News