Skip to main content

Namaste NRI

యూఎస్ కాన్సులేట్‌లో సంద‌డి చేసిన ఎన్టీఆర్

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ను స్టార్ హీరో ఎన్టీఆర్ సందర్శించారు. అమెరికాలో తన సినిమా షూటింగ్ చేయనున్న నేపథ్యంలో తారక్ అక్కడికి వెళ్లారు. కాన్సులేట్‌లోకి ఎన్టీఆర్‌ను స్వాగతించడం ఆనందం గా ఉందని అమెరి కా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తెలిపారు. ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అమెరికాలో షూటింగ్ చేయడం వల్ల ఇరు దేశాల మధ్య బంధం మరింత పెరుగుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సిని మా చేస్తున్నాడు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే కొంత షూటింగ్ కర్నాటకలో జరుపుకుంది. అయితే ఈ సినిమా త్వరలో అమెరికాలో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. దీంతో ఎన్టీఆర్ యుఎస్ కాన్సులేట్‌కి వెళ్లారని సమాచారం.

Social Share Spread Message

Latest News