Skip to main content

Namaste NRI

ఈ తరం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది: వాసు

అంకిత్‌ కొయ్య, నీలఖి జంటగా విజయ్‌ పాల్‌ రెడ్డి అడిదల, ఉమేష్‌ కుమార్‌ భన్సల్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్‌, మారుతీ టీం ప్రొడక్ట్స్‌, వానర సెల్యూలాయిడ్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. జె.ఎస్‌.ఎస్‌. వర్ధన్‌ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో కీలక పాత్రలు పోషించిన నరేష్‌, వాసుకి మీడియాతో ముచ్చటించారు. నరేష్‌ మాట్లాడుతూ ఈ కథకు బ్యూటీ అనేది సరైన టైటిల్‌. ఎందుకంటే ఈ కథలోనే బ్యూటీ ఉంది. జర్నలిస్ట్‌ సుబ్రహ్మణ్యం రాసిన కథని దర్శకుడు వర్ధన్‌ అందంగా మలిచాడు. ఎంటైర్టెన్మెంట్‌, ఎమోషన్స్‌ కలగలుపు ఈ సినిమా. సినిమాటిక్‌ లిబర్టీ అనేది ఏ మాత్రం లేకుండా పూర్తి ఆర్గానిక్‌గా తీసిన సినిమా ఇది అని అన్నారు.

నటి వాసుకి మాట్లాడుతూ ఆడపిల్ల తల్లిని కావడంవల్ల ఈ కథకు నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. ఒక తల్లికీ, ఒక కూతురుకీ ఉండాల్సిన అవగాహన, బాధ్యత ఈ కథలో ఉన్నాయి. పిల్లల విషయంలో మనం కఠినంగా ఉంటే సరిపోదు, వారి పాయింట్‌లో ఏముందో చూడాలి అని చెప్పే సినిమా ఇది. ఈ తరం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News