Namaste NRI

ఎన్టీఆర్ -జాన్వీ కపూర్ రొమాన్స్ అదిరింది.. దేవర నుంచి

ఎన్టీఆర్‌ దేవర సినిమా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ని మేకర్స్‌ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమాలోని తొలిపాట ఫియర్‌ సాంగ్‌ మాస్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సోమవారం రెండోపాట విడుదలైంది. చుట్టమల్లె చుట్టేస్తావే తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నా మైమరపు చేతనైతే నువ్వే నన్నాపూ అంటూ హీరోయిన్‌ పాయింట్‌ ఆఫ్‌వ్యూలో సాగే ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాయగా, అనిరుధ్‌ స్వరపరిచారు. శిల్పారావు ఆలపించారు. కథానాయకుడిపై తనకున్న ప్రేమను కథానాయిక ఆవిష్కరించేలా సాహిత్యం, చిత్రీకరణ సాగింది. ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌లపై మోస్ట్‌ రొమాంటిక్‌గా దర్శకుడు కొరటాల శివ ఈ పాటను తెరకెక్కించినట్టు తెలుస్తున్నది. రత్నవేలు ఛాయాగ్రహణం విజువల్‌ వండర్‌గా సాగింది.

ఈ పాటలో ఎన్టీఆర్‌ ైస్టెలిష్‌గా కనిపిస్తుంటే, జాన్వీ గ్లామర్‌ అవతార్‌లో యూత్‌ని ఆకట్టుకునేలా ఉంది. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 27న దేవర 1 విడుదల కానుంది. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె నిర్మాతలు. సమర్పణ: నందమూరి కల్యాణ్‌రామ్‌.

Social Share Spread Message

Latest News