Namaste NRI

తెలంగాణలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ విస్తరణ

పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది.  అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్‌ను విస్తరించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్లూఎస్) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది.

ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాద్‌లో ఉంది. గతేడాది అమెజాన్ డెడికేటేడ్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్‌ను అమెజాన్ ఎయిర్ ప్రారంభించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు (ఏడబ్లూఎస్) సంబంధించి హైదరాబాద్‌లో మూ డు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అమెజాన్‌తో చర్చలు విజయవంతమయ్యాయని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ విస్తరణకు కంపెనీ మందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress