Namaste NRI

ఇస్రో ఖాతాలో మరో విజయం.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–3 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్  నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను‌ నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని విజయవంతం గా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయటం, అందుకు అనుకూలమైన పేలోడ్‌ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌’ ఈవోఎస్‌-08ను తక్కువ ఎత్తు లోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్‌ లక్ష్యం. దాదాపు 6 నెలల తర్వాత ఇస్రో చేపడుతున్న రాకెట్‌ ప్రయోగమిది. కేవలం రెండు రోజుల ప్రణాళికతో చిన్న చిన్న శాటిలైట్స్‌ను తక్కువ ఖర్చుతో భూ కక్ష్యలోకి చేర్చేందుకు ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 రాకెట్‌తో సాధ్యమవుతుందని ఇస్రో మాజీ సైంటిస్టు ఒకరు చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress