Namaste NRI

సినీ నటి హేమపై మా సస్పెన్షన్ ఎత్తివేత

బెంగళూరు డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో సినీ నటి హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) నిర్ణయం తీసుకుంది. మా అధ్యక్షుడు మంచు విష్ణు నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కొద్ది రోజుల క్రితం బెంగళూరు రేవ్‌ పార్టీ డ్రగ్స్‌ వ్యవహారంలో అక్కడి పోలీసు లు హేమను అరెస్ట్‌ చేశారు. అనంతరం మా ఆమెపై సస్పెన్షన్‌ విధించింది. అయితే ఇటీవల విడుదల చేసిన వీడియోలో తాను ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదని, దేశంలోనే ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నట్లు హేమ తెలిపింది. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, మా తనకు అండ గా నిలవాలని ఆమె అభ్యర్థించింది. ఈ విషయాలతో మా అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖ రాయడంతో పాటు మెడికల్‌ సర్టిఫికెట్‌లను కూడా అందజేసింది. ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించిన మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ హేమపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

Social Share Spread Message

Latest News