నారా రోహిత్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం సుందరకాండ. వృత్తి వాఘని, శ్రీదేవి విజయ్‌కుమార్ కథానాయికలు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాత లు. ఈ సినిమా నిర్మాణం తుదిదశకు చేరుకుంది. మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా హైదరా బాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడారు. ఇదొక పెక్యులర్ లవ్‌స్టోరీ. ఈ జర్నీ చాలా స్పెషల్. దర్శకుడు వెంకటేశ్ మంచి కథ రాసుకున్నా డు. నిర్మాతలు సంతోష్, గౌతమ్, రాకేష్‌లు కథను బాగా నమ్మారు. ఈ కథే మా అందర్నీ కలిపింది. ఈ సినిమా కు అన్నీ బాగా కుదిరాయి. మంచి కంటెంట్‌తో రాబోతున్నాం. ఆదరిస్తారని నమ్ముతున్నా అని అన్నారు.
టీజర్ లాగే సినిమా కూడా క్లీన్ ఎంటర్‌టైనర్ అనీ, సినిమా చూసిన వాళ్లు మంచి మెమరీస్‌తో ఇంటికెళ్తారని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. నరేశ్, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేశ్, అభినవ్ గోమఠం రూపాలక్ష్మీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రదీప్ ఎం.వర్మ, సంగీతం: లియోన్ జేమ్స్.