బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంపై బీఆర్‌ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల హర్షం వ్యక్తంచేశారు. కవితపై ఈడీ అక్రమంగా కేసు బనాయించి, ఇన్నాళ్లుగా ఎలాంటి ఆధారాలు చూపకుండా, అన్యాయంగా ఐదున్నర నెలలుగా జైల్లో ఉంచడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ ఎస్‌ను, కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే కవితను జైలుకు పంపారని, రాజకీయ కుట్రతో పెట్టిన కేసులో చివరికి న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు చారిత్రాత్మకమని, ఎలాంటి ఆధారాలు సమర్పించకుండా రాజకీయ కక్షతో చట్టాలను అడ్డుపెట్టుకొని నచ్చినవిధంగా వేధించడం కుదర దని సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోయిందన్నారు. పోరాట యోధుడి కూతురుని అన్యాయం గా నిర్భందిస్తే పర్య వసానాలు ఎలా ఉంటాయో కవితక్క భవిష్యత్ పోరాటాలు మనకు తెలియజెప్పనున్నాయ ని, న్యాయం గెలిచింది సత్యం బతికే ఉందని బీఆర్‌ఎస్ స్విట్జర్లాండ్ పేర్కొంది.