స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించే సరికొత్త ఫోన్‌ను హెచ్‌ఎండీ అనే యూరోపియన్ ఫోన్ల తయారీ కంపెనీ తయారు చేసింది. అయితే ఈ ఫోన్‌లో స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఫీచర్లు ఏమీ ఉండవు. వాట్సాప్, సోషల్ మీడియా యాప్‌లు ఇందులో కనిపించవు. అసలు ప్లే స్టోర్ అనేదే ఈ ఫోన్‌లో ఉండదు. టచ్‌స్క్రీన్ బదులు కీప్యాడ్ ఉంటుంది. సెల్ఫీలు దిగేందుకు ఫ్రంట్ కెమెరా ఉండదు. కేవలం ఒకే ఒక్క మామూలు వీడియో గేమ్ మాత్రమే ఉంటుం ది. మొబైల్ ఇంటర్నెట్ కూడా చాలా తక్కువ స్పీడ్‌తో మాత్రమే వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే తొలుత కనీస ఫీచర్లతో ఫోన్‌లు ఎలా ఉండేవో ఈ ఫోన్ కూడా అలానే ఉంటుంది. ప్రస్తుతం దాదాపు రూ.11 వేల ధరకు ఈ ఫోన్ యూకే, యూరోప్‌లో అందుబాటులోకి వచ్చింది.