వి.సముద్ర స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం కుంభ. విజయ్‌రామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్ని వేశానికి నిర్మాత డీఎస్‌రావు క్లాప్ ఇవ్వగా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్ని వేశానికి చంద్రమహేశ్, దేవి ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులంతా ఆకాంక్షించారు. కథలను నమ్మి కొత్తవాళ్లతో అయిదు సినిమాలు చేస్తున్నా. అందులో కుంభ ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ఇది అని సముద్ర తెలిపారు.
అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాత సముద్రకు హీరో విజయ్‌రామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. సూరజ్ ఆదిత్యసింగ్, జ్యోతి యాదవ్, రవి జంగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీవెంకట్, సంగీతం: వరంగల్ శ్రీను.