నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 35-చిన్న కథ కాదు. ఈ చిత్రానికి నందకిషోర్ ఈమాని దర్శకుడు. రానా సమర్పకుడు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. పేరెంట్స్ అందరూ వారి పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా అన్నారు. ఇండస్ట్రీలో తనకు రానా మంచి మిత్రుడని, న్యూటాలెంట్‌ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాడని, ప్రతీ కుటుంబం ఈ సినిమాతో కనెక్ట్ అవుతుందని అన్నారు. తనకు స్కూల్ రోజుల్లో లెక్కల సబ్జెక్ట్ అస్సలు నచ్చేది కాదని, ఈ కథ విన్నప్పుడు తన బయోపిక్ అనుకున్నానని రానా చెప్పారు. ఈ చిత్రాన్ని అమ్మలంద రికీ అంకితమిస్తున్నానని కథానాయిక నివేద థామస్ పేర్కొంది. ఈ నెల 6న విడుదలకానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.