ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర-1. ఈ చిత్రాన్ని కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. సైఫ్‌అలీఖాన్, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. చుట్టమల్లె అనే పాటకు యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వీక్షణలు దక్కాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి దావుడి అనే మూడో పాటను విడుదల చేశారు. ఫాస్ట్‌బీట్‌తో సాగిన ఈ పాటలో నాయకానాయికలు ఎన్టీఆర్, జాన్వీకపూర్‌ల నృత్యాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతాన్ని నకష్ అజీజ్, ఆకాశ ఆలపించారు. ప్రేక్షకుల్ని హుషారెత్తించే గీతమిదని, థియేటర్లో అభిమానులతో డ్యాన్స్‌లు చేయిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.