ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మరోమారు తన సహృదయాన్ని చాటారు. ఏపీ, తెలంణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నానని వెల్లడించారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు.