భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ముగిసిన తరువాత రాహుల్ గాంధీ అమెరికా పర్యనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో రాహుల్ అమెరికా టూర్‌కి ప్రాధాన్యత ఏర్పడిరది. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రవాస భారతీయులు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యుల నుంచి డల్లాస్‌లో లభించిన ఆత్మీ స్వాగతానికి సంతోషిస్తున్నాను. అర్థవంతమైన చర్చల్లో పాల్గొనడానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటనలో కృషి చేస్తాను అని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 8వ తేదీన డల్లాస్‌లో, 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో పర్యటన జరగనుంది. ఈసారి పర్యటనలో విద్యావేత్తలు, జర్నలిస్టులు, థింక్ ట్యాంక్ ప్రతినిధులు,సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఇక యూనివర్సిటీ ఆఫ్ టెక్నాస్‌లో ఆయన విద్యార్థులు, విద్యావేత్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.