టోక్యో నందు తెలుగు అసోసియేషన్ జపాన్ (TAJ) వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఘనంగా జెరుపుకు కున్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా వినాయకుడి పూజల్లో పాల్గొని ఆశీస్సులు పొందారు.తెలుగు వాళ్లంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించి గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. పిల్లలు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని గణ నాథునికి పూజ కార్య క్రమాలు నిర్వ హించారు. ఆదివారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్దలు మరియు పిల్లలు ఆనందంతో పాల్గొన్నారు.