Namaste NRI

ఫియర్ టీజర్ రిలీజ్ ఈవెంట్

వేదిక హీరోయిన్‌గా  లీడ్‌ రోల్‌ చేసిన చిత్రం ఫియర్‌. అరవింద్‌ కృష్ణ ప్రత్యేకపాత్ర పోషించారు. హరిత గోగినేని దర్శకత్వంలో ఏఆర్‌ అభి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా హైదరాబా ద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో వేదిక మాట్లాడారు. డైరెక్టర్‌ హరిత అందరికీ నచ్చేలా ఈ సినిమాను తీశారు. డైరెక్టర్‌గా ఇది ఆమె తొలి సినిమా అంటే ఎవరూ నమ్మరు. ఈ సినిమాలో చేసిన రోల్‌ నటిగా నాకు సంతృప్తినిచ్చింది. అనూప్‌రూబెన్స్‌ బీజీఎం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఈ సినిమాకు విడుదలకు ముందే 64 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులొచ్చాయి. ప్రేక్షకులకు కూడా తప్పక నచ్చుతుంది అని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలోని కథానాయిక పాత్రకు నేను కోరుకున్న అన్ని అర్హతలు ఉన్న నటి వేదిక. అందుకే ఆమెను తీసుకున్నా. అనూప్‌ తన మ్యూజిక్‌ ద్వారా నటిగా వేదికను, డైరెక్టర్‌గా నన్నూ డామినేట్‌ చేశారు. అది రేపు తెరపై చూస్తారు. జీవితంలో కొన్ని అనుకోని సందర్భాల్లో ఒక అమ్మాయి భయపడితే పర్యావసానాలు ఎలా ఉంటా యి అనేదే ఫియర్‌ కథ. వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం అని డైరెక్టర్‌ హరిత గోగినేని తెలిపారు.

Social Share Spread Message

Latest News