ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. వ్యూహాత్మక క్వాడ్ సదస్సుతోపాటు పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఐక్యరాజ్యసమితిలో జరిగే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపై సమావేశంతో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభం అవుతుంది. భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.