అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మీయత, మర్యాద తనను కట్టి పడేశాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా రెండో రోజు న్యూయార్క్ లో యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ వల్లే ఇంతటి గౌరవం వచ్చింది. ఇక్కడికి మీరు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. గతంలో ఒక పార్టీ కార్యకర్తగా వచ్చా. ఏ పదవిలో లేనప్పుడు అమెరికాలో 29 రాష్ట్రాలు తిరిగాను. భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు. నేను అమెరికాకు వచ్చిన ప్రతిసారి రికార్డు తిరగ రాశారు. వైవిధ్యంలో భిన్నత్వాన్ని అర్థం చేసుకుని జీవించడం మన మూలాల్లోనే ఉంది. విలువలే మన బలం. భాషలు అనేకం, భావం ఒక్కటే, మీరు అమెరికా-భారత్ అనుసంధాన కర్తలుగా ఉన్నారు. మనం ఎక్కడికెళ్లినా ఒక కుటుంబంలా వ్యవహరిస్తాం అని చెప్పారు.