మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను నిర్వహించారు. మా ఆధ్వర్యంలో జీవీకే హెల్త్ హబ్ ద్వారా ఈ హెల్త్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంప్‌లో మా సభ్యలంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ డా.శాస్త్రిగారికి, జీవీకే హెల్త్ హబ్‌కు మా తరఫున కృతజ్ఞతలు. వేల ఖర్చుతో కూడుకున్న హెల్త్ చెకప్‌ను ఉచితంగా అందించడం సామాన్యమైన విషయం కాదు. ఉదయం 7గంటల నుంచి ఎంతో ఓర్పుతో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వీరి సేవాకార్యక్రమాలు ఇకపై కూడా ఇలాగే సాగాలని ఆశిస్తున్నా అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాదల రవి, శివబాలాజీ, డా.శాస్త్రి కూడా మాట్లాడారు.