Skip to main content

Namaste NRI

కీలక బిల్లును తిరస్కరించిన ప్రతినిధుల సభ

అధికార మార్పిడికి సిద్ధమవుతున్న అమెరికా ఆర్థిక ప్రతిష్ఠంభన దిశగా అడుగులు వేస్తున్నది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును ప్రతినిధుల సభ తిరస్కరించడంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం రాత్రిలోగా ఈ బిల్లు ఆమోదం పొందకపోతే షట్‌డౌన్‌ తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి గతంలో బైడెన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. దీంతో మార్చి 14 వరకు ప్రభుత్వానికి నిధులను సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రుణాలపై సీలింగ్‌ను రెండేండ్లపాటు సస్పెండ్‌ చేయడం సహా ట్రంప్‌ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు.

దీంతో కొత్త బిల్లుకు ట్రంప్‌ మద్దతు తెలపడంతోపాటు దానికి అనుకూలంగా ఓటేయాలని రిపబ్లికన్లకు పిలుపు నిచ్చారు. కానీ, ఈ బిల్లును డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతినిధుల సభలో ఓటింగ్‌ నిర్వహించడంతో ఆ బిల్లు 235-174 తేడాతో తిరస్కరణకు గురైంది. ఈ బిల్లును వ్యతిరేకించిన డెమోక్రాట్లకు ఏకంగా 38 మంది రిపబ్లికన్లు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. సెనేట్‌లో కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతుండటంతో ఈ బిల్లుకు ఆమోదం లభించడం క్లిష్టంగా మారింది. శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో పార్లమెంట్‌ విఫలమైతే అమెరికాలో మరోసారి షట్‌డౌన్‌ తప్పదని, ఇది ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. గతంలో ట్రంప్‌ హయాంలో 35 రోజులపాటు షట్‌డౌన్‌ కొనసాగిందని గుర్తుచేస్తూ,  అమెరికా చరిత్రలో ఇదే సుదీర్ఘమైన షట్‌డౌన్‌ అని పేర్కొంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events