Skip to main content

Namaste NRI

ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

మలయాళ అగ్ర నటుడు సురేశ్‌గోపి, అనుపమ పరమేశ్వరన్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ (జె.ఎస్‌.కె). యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ నారాయణన్‌ దర్శకుడు. జె.ఫణీంద్రకుమార్‌ నిర్మాత. ఉత్కంఠకు గురిచేసే కోర్ట్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందిందని, జానకి అనే స్త్రీ తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ద్వారా ఎలా ఎదుర్కొన్నది అనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తమని, కేసు వాదించే లాయర్‌గా సురేశ్‌గోపీ నటించారని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. బైజు సందోష్‌, మాధవ్‌ సురేశ్‌గోపి, దివ్య పిళ్లయి, అస్కర్‌ అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రెనదివ్‌, సంగీతం: గిరీష్‌ నారాయణన్‌, జిబ్రాన్‌, నిర్మాణం: కాస్మోస్‌ ఎంటైర్టెన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News