Skip to main content

Namaste NRI

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ కిల్లర్

పూర్వాజ్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ కిల్లర్‌. జ్యోతి పూర్వాజ్‌, విశాల్‌ రాజ్‌, గౌతమ్‌ ఇందులో ముఖ్య పాత్రధారులు. పూర్వాజ్‌ ప్రజయ్‌ కామత్‌, ఎ.పద్మనాభరెడ్డి, నిర్మాతలు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటున్నది. హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీ, వికారాబాద్‌ పరిసరాల్లో సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరించారు. హీరో పూర్వాజ్‌, హీరోయిన్‌ జ్యోతి పూర్వాజ్‌, విశాల్‌రాజ్‌, గౌతమ్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. హీరో, దర్శకుడు పూర్వాజ్‌ మాట్లాడుతూ ప్రేమ, ప్రతీకారం, రొమాన్స్‌ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ సినిమా ఇది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఈ కథలో కీలక పాత్ర పోషిస్తున్నది. త్వరలోనే షూటింగ్‌ పూర్తిచేసి మీ ముందుకొస్తాం. ఓ స్పెషల్‌ మూవీగా ఆడియన్స్‌ మనసుల్లో నిలిచిపోయే సినిమా ఇది అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్‌ బొమ్మిశెట్టి, సంగీతం: అషీర్‌ ల్యూక్‌, సుమన్‌ జీవరతన్‌, నిర్మాణం: థింక్‌ సినిమాస్‌, మెర్జ్‌ ఎక్స్‌ఆర్‌, ఏయు అండ్‌ ఐ.

Social Share Spread Message

Latest News