మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్బర్గ్ సంపద మరింత పెరిగింది. గత రెండేండ్లుగా ఆయన నికర ఆదాయం ఆరురెట్లు పెరిగి 201 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన కంపెనీ స్టాక్ విలువ అనూహ్యంగా పెరగడంతో ఆయన సంపద కూడా అదే స్థాయిలో పెరగడంతో ఆయన ఇప్పుడు ప్రపంచంలోని కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నారు. ఆయన కంటే ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. జుకర్బర్గ్ సంపద 200 బిలియన్ డాలర్ల మార్కుకు చేరుకోవడం ఇదే తొలిసారి. 2022లో ఒక దశలో ఆయన వంద బిలియన్ డాలర్ల వరకు కోల్పోయినా అనూహ్యంగా పుంజుకున్నారు.