స్టార్ స్టేటస్ సాధించిన అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో రీతూవర్మ ఒకరు. ఎంతో శ్రమిస్తేగానీ ఆమె ఈ స్థాయికి రాలేదు. హీరోయిన్ ఫ్రెండ్స్‌లో ఒకరిగా ఆమె కనిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. పెళ్లి చూపులు తో హీరోయిన్ స్థాయికి చేరుకున్న రీతూ, కనులు కనులను దోచాయంటే, వరుడు కావలెను, టక్ జగదీష్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. తెలుగు హీరోయిన్లలో ప్రామిసింగ్ యాక్ట్రెస్‌గా పేరు సంపాదించు కుంది. తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నది. ఇవే కాక హాట్‌స్టార్ కోసం ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నది. ఇది తను చేస్తున్న తొలి సిరీస్. ఇదిలావుంటే స్వాగ్ సినిమాతో త్వరలో ఆమె ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇందులో వింధ్యామర వంశ మహారాణి రుక్మిణీదేవి పాత్రలో మెరవనున్నది రీతూ. ఈ సినిమాలో ఆమె పాత్ర హైలైట్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.