సాధారణం కంటే అధిక వేగంతో ఎవరెస్టు ఎత్తు ఏటేటా పెరుగుతున్నది. దీనికి కారణం ఓ నది అని శాస్త్రవేత్త లు గుర్తించారు. ఎవరెస్టు కింద భూగర్భంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల వాస్తవానికి ఏటా 0.04 ఎంఎం నుంచి 1 ఎంఎం మాత్రమే పెరగాలి. కానీ, ప్రస్తుతం 0.08 ఎంఎం నుంచి 2 ఎంఎం ఎత్తు పెరుగుతున్నది. దీనిపై యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా ఎవరెస్టు కింది భాగంలో నదుల ప్రవాహం పెరుగుతూ ఎవరెస్టు ఎత్తుకు కారణం అవుతున్నట్టు తేలింది. ఎవరెస్టుతో పాటు పక్కనున్న పర్వతాలు కూడా దీనివల్ల ప్రభావితానికి గురయ్యాయని వెల్లడైంది.