ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందలాది మిస్సైళ్లతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఐక్య రాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా ఆ దేశం నిషేధం విధించింది. ఇరాన్ మిస్సైల్ దాడిని ఖండించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఇజ్రాయెల్, ఈ మేరకు ఆయనకు దేశంలో రాకుండా బ్యాన్ విధించింది. యూఎన్ సెక్రెటరీ జనరల్ గుటెర్రెస్ వ్యక్తిత్వం లేని మనిషి అని ఇజ్రాయెల్ మంత్రి కాజ్ట్ విమర్శించారు. ఇరాన్ దాడిని ఖండించలేని ఎవరికైనా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే అర్హత లేదన్నారు.