కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఫణి. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఓఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమా బ్యానర్ లోగో, టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం యూఎస్‌లోని డల్లాస్‌లో జరిగింది. బ్యానర్ లోగోను నిర్మాత అనిల్ సుంకర, టైటిల్‌ను తోటకూర ప్రసాద్ లాంచ్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇదని, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించామని దర్శకుడు వీఎన్ ఆదిత్య తెలిపారు. ఈ కథ తనను ఎంతగానో ఇంప్రెస్ చేసిందని, కెరీర్‌లో తొలిసారి మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ చేశానని కథానాయిక కేథరిన్ ట్రెసా పేర్కొంది. మొత్తం షూటింగ్ అమెరికాలోనే జరుపుతున్నామని, ఇప్పటికి యాభైశాతం చిత్రీకణ పూర్తయిందని, పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాత, సంగీత దర్శకురాలు డాక్టర్ మీనాక్షి అనిపిండి తెలిపారు. ఈ చిత్రానికి రచన పద్మావతి మల్లాది, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీఎన్ ఆదిత్య.