Namaste NRI

వీక్షణం టీజర్‌ విడుదల

రామ్‌ కార్తీక్‌, కశ్వి జంటగా జంటగా నటించిన చిత్రం వీక్షణం. దర్శకుడు మనోజ్‌ పల్లేటి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ టీజర్‌ విడుదల చేశారు. ఈ  సందర్భంగా మనోజ్‌ పల్లేటి మాట్లాడుతూ నేను రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌లో శిక్షణ పొందాను. ఒకరోజు విక్టరీ వెంకటేశ్‌ ఓ మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏమిటంటే మన పని మనం చూసుకోవడం. ఆయన చెప్పిన మాటే మా వీక్షణం సినిమాకు కథా నేపథ్యం. ఇందులో హీరో ఎప్పుడూ పక్కవాడి లైఫ్‌లో ఏం జరుగుతుందో చూడాలనే ఉత్సాహంలో ఉంటాడు. దాని వల్ల అతను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నది ఆసక్తికరంగా చూపించాం అని చెప్పారు.   

ఫన్‌, లవ్‌, సస్పెన్స్‌, మిస్టరీ అంశాలున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాతలు పి.పద్మనాభరెడ్డి, అశోక్‌రెడ్డి చెప్పారు. తమ టీమ్‌లోకి సురేశ్‌ కొండేటి జాయిన్‌ అయిన తర్వాత సినిమా మీద నమ్మకం పెరిగిందని హీరో రామ్‌ కార్తీక్‌ చెప్పారు. ఈ చిత్రం 18న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News