హమాస్ కీలక నేత, గాజా ప్రధానిగా వ్యవహరిస్తున్న రావీ ముష్తాహాను ఇజ్రాయిల్ బలగాలు హత్య చేశాయి. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ భద్రతా దళం (ఐడిఎఫ్) ప్రకటించింది. కొన్ని నెలల క్రితమే తాము జరిపిన దాడుల్లో ఆయన చనిపోయినట్లు పేర్కొంది. ముష్తాహాను లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ దళాలు మూడు నెలల క్రితం గాజాలో భీకర దాడులు సాగించాయి. ఆ దాడుల్లో ఆయనతో పాటు హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ నేత సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ చీఫ్ సమి ఒదేహ్ చనిపోయినట్లు ఐడిఎఫ్ తెలిపింది. అయితే వీరి మరణాలను హమాస్ ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.