అంజన్ రామచంద్రన్, శ్రావణి రెడ్డి జంటగా నటించిన చిత్రం లవ్ రెడ్డి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను స్మరణ్ రెడ్డి దర్శకత్వం. సునంద. బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్.జి, మదన్‌గోపాల్ రెడ్డి నిర్మించారు. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ స్మరణ్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం టీమ్ ప్రాణం పెట్టి పనిచేసింది. సినిమా అనుకున్న దానికంటే గొప్పగా వచ్చింది అని చెప్పారు. నిర్మాత మదన్ మాట్లాడుతూ మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. ఈ స్వచ్చమైన ప్రేమకథను అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది అని అన్నారు. ఈ నెల 18న సినిమా విడుదలవుతోంది. ఎడిటర్: కోటగిరి వేంకటేశ్వరావు, సంగీతం: ప్రిన్స్ హెన్రీ.