మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మొన్నటి వరకూ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఆ స్థానంలోకి జుకర్ బర్గ్ వచ్చి చేరారు. నాలుగు రోజుల క్రితం విడుదలైన ప్రపంచ సంపన్నుల జాబితాలో మార్క్ జుకర్ బర్గ్ 200 బిలియన్ డాలర్ల నికర సంపదతో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక 265 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా బాస్ ఎలాన్ మస్క్ టాప్ ప్లేస్‌లో నిలివగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.
అయితే, తాజాగా విడుదలైన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మెటా ప్లాట్ ఫామ్ షేర్ల విలువ ఒక్కసారిగా పెరగడంతో జుకర్ బర్గ్ నికర ఆస్తుల విలువ పెరిగింది. దీంతో జుకర్ బర్గ్, జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి 206.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలోకి ఎగబాకారు. ఎలాన్ మస్క్ కంటే 50 బిలియన్ డాలర్లు వెనుకబడి ఉన్నారు.