సుహాస్, సంగీర్తన జంటగా నటించిన జనక అయితే గనక చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దిల్‌రాజు మాట్లాడుతూ గతంలో హ్యాపీడేస్, శతమానం భవతి చిత్రాలను ఓవర్సీ్‌సలో ముందుగా రిలీజ్ చేశాను. ఆ సెంటిమెంట్‌తోనే జనక అయితే గనక సినిమాను ముందుగానే అంటే ఈ నెల 10న ఓవర్సీ్‌సలో విడుదల చేస్తున్నాం. 12న ఇక్కడ రిలీజ్ చేస్తాం అని చెప్పారు. ఇప్పటికే చాలా మందికి సినిమా చూపించాం. పూర్తి వినోదభరితంగా ఉంటుంది. అందరినీ అలరించే సినిమా అవుతుంది అన్నారు. హీరో సుహాస్ మాట్లాడుతూ ఈ సినిమా ఎవరినీ నిరాశ పరచదు. చూసిన వాళ్లు బాగుందని చెబుతున్నారు. ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందా అని అక్టోబర్ 12 కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హర్షిత్‌రెడ్డి, సంగీర్తన, సందీ్‌పరెడ్డి కూడా పాల్గొన్నారు.