అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్‌లో నటిస్తున్నసినిమాతో ఆండ్రీవ్ బాబు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. యూనిక్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ లండన్‌లోని అందమైన లొకేషన్లలో కొనసాగుతోంది. రెండు స్టోరీ లైన్స్ ఆధారంగా కర్మ థీమ్‌తో సమాంతరంగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. విశేషం. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మై3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ గణేశ్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఊట్ల నిర్మిస్తున్నారు. సితార ఫిలిమ్స్ లిమిటెడ్ ఈ చిత్రానికి లైన్ ప్రొడక్షన్ పనులు చూసుకోనుంది. ఆండ్రీవ్ బాబు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా కూడా పనిచేస్తుండటం విశేషం.
