ఖల్థిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ – కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాన జస్టిన్ ట్రూడో నే స్వయంగా ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ట్రూడో ఆరోపణలతో రెండేళ్లుగా భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ట్రూడో ఆరోపణలను మాత్రం భారత్ ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు కెనడా ప్రధాని చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
కెనడా అధికార లిబరల్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు జస్టిన్ ట్రూడోకు అల్టిమేటం జారీ చేశారు. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని లేదంటే తిరుగుబాటు చేస్తామంటూ హెచ్చరించారు. ఈ మేరకు డెడ్‌లైన్ కూడా పెట్టారు. అక్టోబర్ 28లోగా రాజీనామా చేయాలన్నారు. ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై మొత్తం 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేసినట్లు తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఊహించి రాజీనామా చేయాల్సిందిగా ప్రధానిని కోరినట్లు పేర్కొంది.