Namaste NRI

వరుణ్‌తేజ్ మ‌ట్కా నుంచి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్‌

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మట్కా. మీనాక్షి చౌదరి క‌థ‌నాయిక‌. కరుణ కుమార్‌ దర్శకుడు. ఈ సినిమాలో రెట్రో స్టైల్ లో తెరకెక్కించిన రెండో పాటను మేకర్స్‌ విడుదల చేశారు. కూర్చుంటే ఏదీ రాదు.. తలబడితే నీదే దునియా అంతా అంటూ భాస్కరభట్ల రాసిన ఈ పాటను జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరపచగా, మనో ఆలపించారు.  వరుణ్‌తేజ్‌ ఈ పాటలో రెట్రోలుక్‌లో  స్టైలిష్ గా కనిపించారు. ఓ సాధారణ యువకుడి అసాధారణ ప్రయాణం నేపథ్యంలో సాగే కథ ఇదని, యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నామని, 1980-90 దశకంలో కథ నడుస్తుందని మేకర్స్‌ తెలిపారు. నోరా ఫతేహి, నవీన్‌చంద్ర తదితరులు నటిస్తున్నారు. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, నిర్మాతలు: విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress