Namaste NRI

ఖండాలుదాటిన ప్రేమ…అమలాపురం అబ్బాయి .. కెనడా అమ్మాయి

కెనడా అమ్మాయి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అబ్బాయి ప్రేమ పెళ్లితో ఒక్కటవుతున్నారు. జిల్లాలోని అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన మనోజ్ కుమార్ కెనడా దేశస్తులైన ట్రేసి రో చే డాన్‌తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. మనోజ్ కుమార్ ప్రస్తుతం కెనడాలో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నారు . తెలుగు సంప్రదాయం ప్రకారం రేపు(బుధవారం) దిండి రిసార్ట్స్‌లో వివాహం చేసుకోబోతున్నారు.

కెనడాలో బ్యాంకు మేనేజర్‌గా మనోజ్ పనిచేస్తుండగా ఖాతాదారులైనట్రేసీ రోచేడాన్‌తో పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారింది. కెన్యాలో ఎంగేజ్మెంట్ అనంతరం వివాహం చేసుకోవడానికి భారత్‌కు ఇరు కుటుంబాలు వచ్చాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వారంలో మలికిపురం మండలం దిండిలో వివాహం చేసుకుంటామని మనోజ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 8న ఈ కొత్త జంట రిసెప్షన్ జరుపుకోనున్నారు. కెనడా దేశస్తులు ఈదరపల్లిలో కనిపించడంతో గ్రామస్థులు ఆసక్తిగా చూశారు.

Social Share Spread Message

Latest News