కువైట్లోని భారత రాయబార కార్యాలయం దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. దీనికి కువైట్లోని భారతీయ కమ్యూనిటీ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా, వందనా స్వైకా ఆహ్వానితులకు స్వాగతం పలికారు. వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం యొక్క ఆధ్యాత్మిక విజయానికి ప్రతీక అని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా అన్నారు. ఈ వేడుకలో ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు, శ్రావ్యమైన గానంతో సాంప్రదాయ భారతీయ సాంస్కృతిక వ్యక్తీకరణలను ప్రదర్శించారు. రాయబార కార్యాలయం నిర్వహించిన ఈ వేడుక ఆనందకరమైన వాతావరణాన్ని అందించింది. కువైట్లోని భారతీయ సమాజం మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేసింది. పటాసులు కాల్చి పసందైన భారతీయ వంటకాలను ఆస్వాదించారు.